Site icon TeluguMirchi.com

రంగస్థలం మేకింగ్ వీడియో చూశారా ?


రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వం వహించారు. సమంత కథానాయిక. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు విశేషమైన స్పందన లభించింది.

టైటిల్‌ సాంగ్‌ ‘రంగా రంగా రంగస్థలాన..’ ప్రోమోను విడుదల చేసిన చిత్ర బృందం.. బుధవారం దీని మేకింగ్‌ వీడియోను పంచుకుంది.

ఇందులో పాట సెట్టింగ్‌ను, సెట్‌లో జరిగిన సంఘటనలను చూపించారు. చరణ్‌ను చూసేందుకు అక్కడి గ్రామస్థులు, పిల్లలు పెద్ద సంఖ్యలో సెట్‌కు వచ్చారు. వీరందరినీ చరణ్‌ పలకరించారు. చిన్నారులతో కలిసి సమయం గడిపారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

Exit mobile version