టాలీవుడ్ లో ప్రస్తుతం అందరూ ఎదురుచూస్తున్న మూవీ రంగస్థలం. ట్రైలర్లో కమర్షియల్ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. చిత్రబృందం కూడా `మాది పక్కా కమర్షియల్ సినిమా` అని చెబుతుంది/ అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి మాటలు చూస్తుంటే ఇది అవార్డు సినిమానా?? అనే అనుమానాలు వస్తున్నాయి.
అవార్డుల కోసం ఎవరూ సినిమాలు తీయరు. కానీ ఈసారి అవార్డులన్నీ ‘రంగస్థలం’కి వస్తాయి. జాతీయ అవార్డులొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. రావాలి.. రాకపోతే అన్యాయం జరిగినట్టే’’ అన్నారు చిరంజీవి. అంతేకాదు సుకుమార్.. ఈ సినిమాని చాలా ప్యూర్ గా తీశారు. అసలు లైన్ దాటలేదు. మంచి కలర్ పుల్ లొకేషన్ లో చాలా లావిష్ గా తీయవచ్చు. కానీ సుకుమార్ గీత దాటలేదు. చాలా జెన్యూన్ సినిమా ఇది’ అన్నారు చిరు.