శృతిహాసన్ ప్రేమలో పడిందట..ఎవరితో తెలుసా..?

ranbir-sruthi-loveతెలుగు, తమిళ్ , హిందీ భాషలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శృతిహాసన్..కమల్ హాసన్ కూతురిగానే కాకుండా తనకంటూ ఓ సొంత ఇమేజ్ ను దక్కించుకున్న హీరోయిన్. అలాంటి ఈ భామ తాజాగా బాలీవుడ్ హీరో తో ప్రేమలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి..

బాలీవుడ్ లో స్టార్ హీరో గానే కాకుండా లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రణబీర్ కపూర్ , శృతిహాసన్ లు కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమించుకుంటున్నారనే వార్త బి టౌన్ లో తెగ ప్రచారం అవుతుంది. ఇటీవలే ఇద్దరు కలిసి ఓ యాడ్ ఫిలింలో చేశారట. ఆ షూటింగ్ లో ఇద్దరూ చనువుగా ఉండడం చూసి అందరు షాకయ్యారట. వీళ్లిద్దరూ క్లోజ్ ఉండడం అసలు రహస్యం ఏంటని ఆరా తీయగా వీరు గాఢ ప్రేమలో ఉన్నారని అంటున్నారు.

గతం లో రణబీర్ దీపికా పదుకొనే తోను, ఆ తర్వాత కత్రినాకైఫ్ తోను డేటింగ్ చేసిన సంగతి తెల్సిందే..తాజాగా వీరి లిస్ట్ లో శృతి హాసన్ చేరింది..మరి ఈమెతోయినా ప్రేమ సాగిస్తాడో లేక మధ్యలో ఆపేస్తాడో చూడాలి.