రణ్‌బీర్‌కపూర్‌ ‘యానిమల్’ విడుదల వాయిదా.. త్వరలోనే కొత్త డేట్..


బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లుక్స్‌, ప్రీ-టీజర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసాయి. కాగా ఈ సినిమాని ఆగష్టు 11 న రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు ట్రేడ్ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ తెలిపారు.

రన్ బీర్ కపూర్ – సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమా ఆగష్టు 11 న విడుదల కావడం లేదు. వాయిదా పడింది. త్వరలోనే కొత్త డేట్ ప్రకటిస్తారని తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఇకపోతే భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీడియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.