Site icon TeluguMirchi.com

రణ్‌బీర్‌కపూర్‌ ‘యానిమల్’ కొత్త రిలీజ్ డేట్ !


బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌కపూర్‌ హీరోగా అర్జున్‌ రెడ్డి ఫేం సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన లుక్స్‌, ప్రీ-టీజర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసాయి. కాగా ఈ సినిమాని ఆగష్టు 11 న రిలీజ్ చేయాల‌ని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

‘యానిమల్’ సినిమా డిసెంబర్ 1న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవ్వనందున ఆగస్టు నుంచి వాయిదా వేసి డిసెంబర్ 1న రిలీజ్ చేస్తున్నామని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్రయూనిట్. ఇకపోతే భూషణ్ కుమార్‌, ప్రణయ్‌ రెడ్డి వంగా, కృషన్‌ కుమార్‌, మురద్‌ ఖేతని ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Exit mobile version