ఆ సినిమా పట్ల హీరో బాధలు అన్ని ఇన్ని కావు..

Ranbir-Kapoor-Ae-Dil-Hai-Muబాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న రణ్‌బీర్ కపూర్ బాధలు ఇన్ని అన్ని కావు..గత కొంత కాలంగా తాను నటించిన ఏ చిత్రం కూడా హిట్ అయినా దాఖలాలు లేవు. ఈ నేపథ్యం లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ & డైరెక్టర్ కరుణ్ జోహార్ దర్శకత్వం లో తెరకెక్కిన ‘యే దిల్ హై ముష్కిల్’ చిత్రం గప్పెడు ఆశలు పెట్టుకున్నాడు..ఈ సినిమా తో తన పూర్వ వైభవం వస్తుందని అనుకున్నాడు..కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే సినిమా రిలీజ్ అవుతుందో కాదో అనే సందిగ్ధం లో పడిపోయాడు..

పాక్ నటుడు ఈ సినిమాలో నటించడం తో ఈ సినిమా రిలీజ్ చేయకూడదని నాల్గు రాష్ట్రాల థియేటర్స్ యాజమాన్యం పిలుపునివ్వడంతో హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి సైతం నిర్మాతలు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ధియేటర్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసేలా చూస్తానని హామీ కూడా ఇచ్చారు. మహారాష్ర్ట, గోవా, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో యే దిల్ హై ముష్కిల్ చిత్రాన్ని విడుదల చేయకూడదని సినిమా ఓనర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చిన థియేటర్స్ యాజమాన్యం మాత్రం దిగిరావడం లేదని బాధ పడుతున్నాడట.