Site icon TeluguMirchi.com

బిపాసా తో మరోసారి అంటున్న ‘రానా’

rana-bipasha‘దం మరో దం’ చిత్రం తరవాత మరోసారి తెర ఫై కనిపించబోతున్నారు రానా, బిపాసా బసు. ‘ఎన్.ఐ.ఏ’ చిత్రం లో ఈ జంట నటించబోతున్నారు. ఈ చిత్రానికి విక్రమ్ ఫడ్నిస్ దర్శకత్వం వహిస్తారు. త్రీ ఏజస్ ప్రొడక్షన్స్ సమర్పణలో రాబోవు ఈ సినిమాకు శంకర్ ఎసహాన్ లాయ్ త్రయం సంగీతం అందించనున్నారు.

ఇక రానా విషయానికి వస్తే హిందిలో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బేబీ’ చిత్రం లో రానా కీలక పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి ప్రతిష్టాత్మక సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సినిమాలన్ని 2015లో విడుదలవుతాయి. మొత్తానికి 2015 రానాకు చాల ముఖ్యమైన ఏడాదిగా తెలుస్తుంది.

Exit mobile version