Site icon TeluguMirchi.com

సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న దగ్గుపాటి రానా..

Rana-Mrgటాలీవుడ్ బ్యాచిలర్స్‌ లిస్ట్ లో ముందుండే దగ్గుబాటి రానా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు… రానా ఏంటి సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా..! జస్ట్ మీము చెపుతుంది నిజజీవితం లో కాదులెండి… ప్రస్తుతం రానా నటిస్తున్న ‘బెంగళూరు డేస్’ అనే రీమేక్ చిత్రంలో రానా పెళ్లి చేసుకున్నాడు. ఆ గెటప్‌ను రానా స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తన సినిమా కెరీర్‌లో మొదటిసారి పెళ్లి కొడుకు వేషం వేశానని రానా తెలిపాడు.

ఏది ఏమైనా రానా మాత్రం పెళ్లి కొడుకు గెటప్‌లో అదిరిపోయేలా ఉన్నాడని అబిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ఆర్య, బాబీ సింహ, శ్రీ దివ్యలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి బ్యానర్‌లో ఈ చిత్రం రూపొందుతోంది.

Exit mobile version