కేవలం తెలుగులోనే కాకుండా హిందీ , తమిళ భాషలలో కూడా సినిమాలు చేసి మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న రానా , తాజాగా మలయాళం కూడా నటించబోతున్నాడు. ఒకప్పుడు మలయాళం లో సూపర్ హిట్ అయినా ‘ కీర్తిచక్ర’ చిత్ర సీక్వెల్ లో నటించబోతున్నాడని సమాచారం. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. మలయాళ సూపర్ స్టార్ ‘మోహన్ లాల్’ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు , హిందీ , తమిళ భాషలలో కూడా తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇప్పటికే మూడు ఇండస్ట్రీ లలో రాణించిన రానా , మిగిలి ఉన్న మలయాళం ఎలా సత్తా చాటుతాడో చూడాలి మరి.
ప్రస్తుతం రానా బాహుబలి 2 చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం 2017 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.