‘రానా’ అదికూడా వదిలిపెట్టడం లేదు..

rana-malayalamలీడర్ చిత్రం తో హీరో గా తెరగేంట్రం చేసిన రానా మొదటిచిత్రం తోనే మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన చిత్రాలేవీ కూడా రానా కు పెద్దగా పేరుతీసుకరాలేకపోయాయి. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం తో భల్లాల దేవా గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.

కేవలం తెలుగులోనే కాకుండా హిందీ , తమిళ భాషలలో కూడా సినిమాలు చేసి మంచి నటుడిగా పేరుతెచ్చుకున్న రానా , తాజాగా మలయాళం కూడా నటించబోతున్నాడు. ఒకప్పుడు మలయాళం లో సూపర్ హిట్ అయినా ‘ కీర్తిచక్ర’ చిత్ర సీక్వెల్ లో నటించబోతున్నాడని సమాచారం. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రానా కనిపించబోతున్నాడు. మలయాళ సూపర్ స్టార్ ‘మోహన్ లాల్’ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగు , హిందీ , తమిళ భాషలలో కూడా తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇప్పటికే మూడు ఇండస్ట్రీ లలో రాణించిన రానా , మిగిలి ఉన్న మలయాళం ఎలా సత్తా చాటుతాడో చూడాలి మరి.

ప్రస్తుతం రానా బాహుబలి 2 చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ చిత్రం 2017 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.