రానా ఇది నువ్వేనా..?

దగ్గుపాటి రానా ఆరోగ్యం ఫై గత కొన్ని నెలలు గా సోషల్ మీడియా లో రకరకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ వార్తల ఫై రానా సైతం ఖండిస్తూ వస్తున్నాడు కానీ ఆయన తాలూకా పిక్స్ ను మాత్రం పోస్ట్ చేయకపోయేసరికి రానా చెప్పేది ఎవ్వరు నమ్మలేదు. ఇలాంటి తరుణం లో తాజాగా రానా తన తాలూకా పిక్ పోస్ట్ చేసి తన ఫై వస్తున్న వార్తలని నిజం అనుకునేలా చేసాడు.

ఒకప్పుడు రానా ఎలా ఉండేవాడు.. ఇప్పుడెలా ఉన్నాడు అని అభిమానులే కాదు సినీ వ్యక్తులు సైతం మాట్లాడుకుంటున్నారు. బాహుబలిలో భళ్లాలుడు ఎలా ఉన్నాడో.. అందులో సగానికి సగం తగ్గిపోయాడు రానా. అసలు ఇంత తగ్గడానికి కారణం ఆయన అనారోగ్యమేనా..లేక సినిమా కోసమా అనేది కరెక్ట్ గా ఎవరికీ అర్ధం కావడం లేదు. నిజం ఏదైనప్పటికీ రానా ప్రస్తుతం పిక్స్ మాత్రం అందరికి షాక్ ఇస్తున్నాయి.