రానా హీరోగా కాజల్ హీరోయిన్గా తేజ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్‌లో సురేష్‌బాబు నిర్మించిన చిత్రం ‘నేనే రాజు నేనే మంత్రి’. ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ, తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల కావడం జరిగింది. గత వారం విడుదలైన మూడు చిత్రాల్లో ఈ చిత్రంపై చేయి సాధించింది. మిగిలిన రెండు చిత్రాలతో పోల్చితే ఈ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి.
తెలుగుతో పాటు తమిళంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కాని అదే రోజు ధనుష్ నటించిన ‘వీఐపీ 2’ చిత్రం విడుదలైంది. దాంతో రానా చిత్రానికి థియేటర్లు లభించలేదు. దాంతో అప్పుడు వాయిదా వేయడం జరిగింది. అప్పుడు వాయిదా వేసిన చిత్రానికి ఇప్పుడు కొత్త డేట్‌ను అనౌన్స్ చేయడం జరిగింది. తమిళం మరియు మలయాళ వర్షన్ ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రాన్ని సెప్టెంబర్ 8న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.
ఈనెల 24న తమిళ స్టార్ హీరో అజిత్ ‘వివేగం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాతో పోటీ వద్దనే ఉద్దేశ్యంతో రెండు వారాల తర్వాత అంటే సెప్టెంబర్ 8న ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. పలు చిత్రాలతో తమిళ ప్రేక్షకులకు రానా సుపరిచితుడే. కాజల్ కూడా తమిళంలో పలు చిత్రాలు చేసి ఆకట్టుకుంది. ఈ కారణాల వల్ల తమిళంలో ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నారు.