ఈ ప్రాణ స్నేహితులు మల్టీస్టారర్ ఫిలిం చేస్తే ఎలా ఉంటుంది…?

best-friendsటాలీవుడ్ ఇండస్ట్రీ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే టక్కున చెప్పే పేర్లు అల్లు అర్జున్ , రానా , రామ్ చరణ్. వీరు ఇప్పటినుండి కాదు చిన్నప్పటినుండి బెస్ట్ ఫ్రెండ్స్. అల్లరి చేసిన , చిలిపి పనులు చేసిన , ఏదయినా గొడవకు దిగిన ముగ్గురు కలిసే చేసావారట. ఇప్పుడు సినిమాలతో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉన్నారు. రానా కేవలం ఫ్రెండ్ కాదు మెగా ఫ్యామిలీ లో ఒక నెంబర్ అని ఈ మెగా హీరోలు చెపుతుంటారు.

అలాంటి ఈ ముగ్గురు మల్టీస్టారర్ చిత్రం చేస్తే ఎలా ఉంటుంది. ఇది మీము అడిగే మాట కాదు యువత సినీ ప్రేక్షకులు కోరుకునే మాట. వీరి నుండి ఒక సినిమా వస్తే చూడాలని మెగా ఫ్యాన్స్ తో పాటు దగ్గుపాటి అభిమానులు కూడా కోరుకుంటున్నారు. తాజాగా ఈరోజు ఫ్రెండ్ షిప్ డే సందర్బంగా “Happy Friendship Day people!! Freinds are the family we choose in this lifetime!!” అంటూ రానా తన ట్విట్టర్ లో ఈ కింది ఇమేజ్ పోస్ట్ చేసి అభిమానులకు ఫ్రెండ్షిప్ డే విషెస్ తెలిపాడు. మరి అభిమానుల కోరిక ఎప్పుడు తీరుస్తారో ఈ ప్రాణ మిత్రులు చూడాలి.