ఓ ఇంటివాడు కాబోతున్న ‘రానా’..

rana-mumabiఏంటి టైటిల్ చూసి కంగారు పడుతున్నారా ? రానా పెళ్లి చేసుకోబోతున్నడా ..? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు..? అనే అనుమానాలు వస్తున్నాయా ?.. మీకు వచ్చిన అనుమానాలు నిజం కాదులెండి..

అసలు మేటర్ ఏమిటంటే..తాజాగా రానా బాలీవుడ్ లో వరస ఆఫర్స్ తో బిజీ అయిపోతున్నాడు.. దాంతో ఇప్పటివరకు ముంబై లోని హోటల్స్ లోనే బస చేస్తూ కాలం గడుపుతున్నాడు.. రోజువారీగా హోటల్స్ లో ఉండి బోర్ కొడుతుందట..దీంతో ముంబై లోనే ఓ మంచి ప్లాట్ కొనుగులు చేయాలనీ డిసైడ్ అయ్యాడట . వెంటనే జుహు ప్రాంతం లో ని ఓ అపార్ట్ మెంట్ లో ప్లాట్ తీసుకున్నాడట. ప్రస్తుతం ఆ ఇంటికి ఇంటిర్యాల్ వర్క్ చేయిస్తున్నాడట. త్వరలోనే ఆ ఇంట్లో అడుగుపెట్టనున్నాడు.