Site icon TeluguMirchi.com

‘బాహుబలి’ మీద పుకార్లను కొట్టేపారేసిన భల్లాల

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి ‘బాహుబలి’ చిత్రం విడుదలయిన అన్ని భాషల్లో కూడా రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. ఈ చిత్ర రెండు పార్టులకు కూడా ప్రేక్షకుల నుండి అశేషమైన స్పందన వచ్చింది. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణంగా మిగిలింది. ఈ చిత్ర విజయాన్ని చూసి బాలీవుడ్‌ దర్శక నిర్మాతలు సైతం నీళ్లు నమిలారు. అంతేకాకుండా ‘బాహుబలి’ విజయాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. అందుకే ఈ చిత్రంపై రకరకాలుగా పుకార్లు లేపుతున్నారు. తాజాగా ఓ హిందీ మేగజన్‌ వారు ‘బాహుబలి’లో ప్రభాస్‌ పాత్ర కోసం మొదటగా బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ను సంప్రదించారు కానీ ఆయన నో చెప్పడంతో ప్రభాస్‌ను తీసుకున్నారు కానీ ప్రభాస్‌ కోసమే ఆ కథను తయారు చేయలేదు అంటూ ప్రచారం చేస్తున్నారు.

ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ భల్లాల దేవుడి పాత్రను పోషించిన రానా దగ్గుబాటి దాకా ఈ విషయం చేరింది. దాంతో రానా వెంటనే క్లారిటీ ఇచ్చాడు. ‘బాహుబలి’ పాత్ర కోసం యూనిట్‌ ఎవరిని సంప్రదించలేదు, ఇది కేవలం ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకునే రచించారు. రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కూడా ప్రభాస్‌ కోసమే ఈ కథను రచించారు. బాలీవుడ్‌ హీరోను దృష్టిలో ఉంచుకుని ‘బాహుబలి’ కథను రాశారు అని, ఆయన తిరస్కరిస్తేనే ప్రభాస్‌ను తీసుకున్నారు అనేది మాత్రం అవాస్తవం అంటూ రానా ‘బాహుబలి’పై పుకార్లను తీవ్రంగా ఖండిరచారు.

Exit mobile version