అవన్నీ పుకార్లే అని క్లారిటీ ఇచ్చిన భల్లాలదేవ

‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా పాత్ర పోషించిన రానా రెండు పార్టులలో కూడా అద్బుతంగా నటించాడు. దాంతో రానా క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. నటనా ప్రాధాన్యం ఉన్న చిత్రాలలో రానా బాగా కుదురుతాడు అని నిరూపించుకున్నాడు. రానా తదుపరి చిత్రం ఏంటి అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కానీ రానా మాత్రం ‘బాహుబలి 2’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా చిరు నటించబోయే ‘ఉయ్యాలవాడ’ చిత్రంలో రానా విలన్‌గా నటించనున్నాడు అనే వార్త తెగ ప్రచారం అవుతోంది. గత రెండు మూడు రోజులుగా ఈ వార్త ఫిల్మ్‌ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

దాంతో ఈ వార్తపై రానా వెంటరు క్లారిటీ ఇచ్చాడు. తాను చిరు ‘ఉయ్యాలవాడ’ చిత్రంలో విలన్‌గా నటించనున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ఇంతవరకు ఈ చిత్రం గురించి తనను ఎవరు సంప్రదించలేదు అని, చిరు చిత్రంలో తాను నటించడం కేవలం పుకారు మాత్రమే అని క్లారిటీ ఇచ్చేశాడు. చిరు చిత్రంపై భల్లాలదేవుడు క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయమై వస్తున్న వార్తలన్నిటికి కూడా తెర పడినట్టు అయ్యింది.