అటు రానాపై, ఇటు కాజల్‌పై ఇది వరకు చాలాసార్లు ఇలాంటి గాసిప్పులు వినిపించాయి. బిపాసాబసుతో రానా ప్రేమాయణం సాగిస్తున్నాడని కొన్నాళ్లు చెప్పుకొన్నారు. ఆ తరవాత త్రిష వచ్చి చేరింది. ఇప్పుడు కాజల్ పేరు తగిలించారు. కాజల్కీ ఇలాంటి వార్తలు కొత్తకాదు. కాజల్‌కి పెళ్లి కుదిరిందని, ఓ వ్యాపార వేత్తతో నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని చెప్పుకొన్నారు. వీటికి కూడా కాజల్ పలుమార్లు సమాధానమిచ్చింది. రానా, కాజల్ కలయికలో ఒక్క సినిమా కూడా రాలేదు. కనీసం యాడ్లోనూ నటించలేదు. మరి వీరిద్దరికీ ఎలా జోడీ కుదిరిందో ఏంటో..? ఈమధ్య రెస్టారెంట్లలోనూ, ప్రైవేటు పార్టీల్లోనూ ఇద్దరూ జాయింటుగా కనిపిస్తున్నారట. దీంతో రానా, కాజల్ ప్రేమాయణం సాగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇది ఎంత వరకు నిజం అనేది వాళ్ళ నోరు విప్పితే కానీ తెలియదు.