చిరు మూవీ లో రానా..?

మెగాస్టార్ చిరంజీవి 151 వ చిత్రం ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి సినిమాలో నటించబోతున్న సంగతి తెల్సిందే..ధృవ ఫేమ్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ , ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది..చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా ఆగస్టు లో ఈ మూవీ సెట్స్ ఫైకి రానుంది. మరో పక్క చిత్ర నిర్మాత రామ్ చరణ్ సినిమా కాస్ట్ & క్రూ సెలెక్ట్ చేయడం ఫై శ్రద్ద పెట్టాడు..

తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ లో ఓ పవర్ రోల్ లో రానా ను ఎంపిక చేయబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రానా కు ఆ రోల్ కు సంబదించిన కథ ను డైరెక్టర్ వినిపించడం జరిగిందని అంటున్నారు. బాహుబలి చిత్రం తో రానా ఏ పాత్ర నైనా అవలీలంగా చేయగలడని నిరూపించుకున్న సంగతి తెల్సిందే.. మరో పక్క హీరో గా కూడా తన సత్తా ను చాటుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు.. ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో రానా ఓ సినిమా చేస్తున్నాడు.