Site icon TeluguMirchi.com

అన్ని ఒదిలేసుకుంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలం: శివగామి

‘బాహుబలి’ చిత్రంలో శివగామిగా కీలక పాత్రలో నటించి తన నటనలో ఇప్పటి వరకు ఏ తేడా లేదు అని నిరూపించుకుంది. యవ్వనంలో ఒయ్యారాలు ఒలకబోసి కుర్రకారుని ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ రాజమాత శివగామిగా ఇప్పటికి అలాంటి నటనే కనబర్చింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన శివగామి సినీ పరిశ్రమ గురించి షాకింగ్‌ వ్యాఖ్యలు చేసింది. ఇంట్లో గారాల పట్టీలుగా పెరిగిన అమ్మాయిలు ఇక్కడ నిలదొక్కుకోవడం చాలా కష్టం, సినీ పరిశ్రమలో అన్ని ఒదిలేసుకుంటేనే లైఫ్‌ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.

ప్రతీ దాన్ని సర్దుకుపోవాలి, కాదు కూడదు అంటే సినీ కలల్ని మరిచి పోవాల్సిందే, హీరోయిన్లకు చాలా ఆంక్షలు ఉంటాయి, ఎంతో కష్ట పడితేగాని ఇక్కడ నిలవడం కష్టం అంటూ శివగామి చెబుతోంది. ఇటీవలె చాలామంది హీరోయిన్లు కూడా సినీ పరిశ్రమపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పడక గదికి వెళితేనే అవకాశాలు ఇస్తారు అంటూ వారు చెప్పిన మాటలు, రమ్యకృష్ణ మాటల్లోని అంతరార్థం ఒకేలా ఉంది. హీరోయిన్‌ కావాలనుకుంటే నటన, అందంతో పాటు అన్ని ఒదిలేసుకుని మొండిగా బతకగలగాలి అని చెప్పకనే చెబుతున్నారు అనుభవజ్ఞులు.

Exit mobile version