Site icon TeluguMirchi.com

భర్త గురించి క్లారిటీ ఇచ్చిన శివగామి

టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి, విడుదలయ్యాక జాతీయ స్థాయిలో రికార్డులు బ్రేక్‌ చేస్తున్న ‘బాహుబలి 2’ చిత్రంలో శివగామి పాత్రలో పోషించి రమ్యకృష్ణ తన కెరియర్‌లోనే నిలిచిపోయే విధంగా గుర్తింపుసు సొంతం చేసుకుంది. ‘బాహుబలి 2’ చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన రమ్యకృష్ణ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కృష్ణవంశీ ప్రస్తుతం హైద్రాబాద్‌లో ఉండగా రమ్యకృష్ణ మాత్ర చెన్నైలో ఉంది. ఇద్దరు దూరంగా ఉండడంతో విభేదాలు వచ్చాయా…?? అనేది ప్రేక్షకుల సందేహం. ఈ అనుమానం కాస్త శివగామి దాకా చేరింది.

భర్తతో విభేదాలు అంటూ వస్తున్న వార్తలపై రమ్యకృష్ణ వెంటనే స్పందించింది. సినిమాు, సీరియల్‌ల వల్లనే తాను చెన్నైలో ఉండాల్సి వస్తుందని, అర్థం చేసుకునే భర్త దొరకడం తన అదృష్టం అని అంటోంది. అంతేకాకుండా తాము చాలా మెచ్యూర్డ్‌గా ఉంటామని, ఆటలాడుతూ చెట్ల చుట్టూ తిరిగే వయస్సు కాదని, తరుచుగా ఫోన్‌ మాట్లాడుకుంటాం, వీలుంటే కచ్చితంగా కలుసుకుంటాం, మా ఇద్దరి మధ్య ఏ విభేదాలు లేవు అంటూ భర్త గురించి శివగామి క్లారిటీ ఇచ్చేసింది.

Exit mobile version