Site icon TeluguMirchi.com

ఇన్నాళ్లకు రామోజీ ఇంట శుభకార్యం

Ramoji raoతెలుగు రాష్ట్రాల్లో రామోజీ రావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈటీవీ, ఈనాడుతో రామోజీ రావు ఏ స్థాయిలో తెలుగు ప్రజల చెంతకు వెళ్లాడో తెల్సిందే. ఇక రామోజీ ఫిల్మ్‌ సిటీతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాడు. అంతా బాగానే ఉన్నా గత కొంత కాలంగా రామోజీరావు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరీ ఇటీవల రామోజీ రావు అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఎదుర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా రామోజీ రావు హాస్పిటల్‌ చుట్టు తిరుగుతూనే ఉన్నారు. తనయుడు సుమన్‌ చనిపోవడంతో పాటు కుటుంబంలో పలు సంఘటనలు రామోజీకి ఇబ్బందిని కలిగిస్తున్నాయి.

ఈ సమయంలోనే రామోజీ వారి ఇంట శుభ కార్యం జరుగబోతుంది. రామోజీ రావు తనయుడు కిరణ్‌ దంపతుల పెద్ద కూతురు సహరి వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే రామోజీ మనవరాలు వివాహ నిశ్చితార్థంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని కిరణ్‌ ఇంటి వద్ద మరియు రామోజీ ఫిల్మ్‌ సిటీలోని రామోజీ ఇంటి వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అతి కొద్ది మంది ప్రముఖుల సమక్షంలో రామోజీ మనవరాలు వివాహ నిశ్చితార్థం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగనుంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ నిశ్చితార్థంకు హాజరు అయ్యే అవకాశాలున్నాయి. ఇక ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా కంపెనీ అధినేత కొడుకుతో సహరి వివాహం జరుగబోతుంది.

Exit mobile version