వ‌ర్మ సీక్రెట్ బ‌య‌ట పెట్టాడు…

varamaరాంగోపాల్ వ‌ర్మ సినిమాలు మేధావుల‌కు మాత్రమే అర్థమ‌వుతాయ‌ట‌.. ఆయ‌న ఆలోచ‌న‌ల వేగం సామాన్యులు అందుకోలేర‌ని ఓ విమ‌ర్శ ఉంది. అదీ నిజ‌మే. వ‌ర్మ సినిమాలు కాస్త అర్థమై, ఇంకాస్త అర్థంకానట్టు ఉంటాయ్‌. దానికి కార‌ణం ఏమిటో వ‌ర్మ స్వయంగా చెప్పారు. ”ఓ సినిమా కోసం నేను నా తెలివి తేట‌ల్లో ప‌ది శాతం మాత్రమే ఉప‌యోగిస్తా. ఓ మంచి సినిమా రావ‌డానికి అంత స‌రిపోతుంది. పొద్దస్తమానూ బుర్ర బ‌ద్దల‌కొట్టుకొని ఆలోచించ‌డం అవ‌స‌రం లేదు…” అని చెప్పుకొచ్చాడు వ‌ర్మ. ప‌ది శాతం ఆలోచిస్తేనే ఇంత వికృత‌మైన ఆలోచ‌న‌లు వ‌స్తున్నాయంటే… మిగ‌తా 90లో ఎన్ని విశ్వరూపాలున్నాయో.??