ఇది మాత్రం బిజినెస్ కాదు: వర్మ

ram-gopal-varmaదర్శకుడు రామ్ గోపాల్ వర్మ 26/11 ముంబై దాడుల సంఘటనపై సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ‘ద అటాక్స్ ఆఫ్ 26/11′ పేరుతో రూపొందుతున్న ఈచిత్రాన్ని తెలుగులో ‘26/11 దాడులు’ పేరుతో విడుదల చేయనున్నారు. అయితే వర్మ తన ప్రతి సినిమాని ఓ కొత్తరకం పబ్లిసిటీ తో ప్రమోట్ చేస్తుంటారు. కానీ ‘ది అటాక్స్ అఫ్ 26/11′ సినిమాని మాత్రం ఎలాంటి పబ్లిసిటీ లేకుండా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అలాగే వర్మ దాదాపు అందరూ కొత్త వారితో ఈ సినిమా ను రూపొందించారు. ఈ సంధర్భంగా వర్మ మాట్లాడుతూ..నేను బిజినెస్ కోసం ఈ సినిమా చేయలేదు. నేను ముంబైలో జరిగిన అటాక్స్ చూసి ఎంతో షాక్ కి గురయ్యారు. ఆ ప్రమాదంలో గురైన వారందరికీ నా వంతు నివాళిగా ఈ సినిమాని తీశాను. ఈ సినిమాని హిందీ, తెలుగు భాషల్లో మార్చి 1వ తేదీన రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు. ఇటివలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ విడుదలై ప్రేక్షకులలో ఈ మూవీ పట్ల మరింత ఆసక్తి నెలకొల్పింది.