Site icon TeluguMirchi.com

నా కెరీర్ లో బెస్ట్ రంగస్థలం : చరణ్

”’నేను చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఈ ఏడాదికి పదేళ్లు. ఈ పదేళ్ల కెరీర్‌లో నేను నటించిన చిత్రాల్లో ‘రంగస్థలం’ ఒక బెస్ట్ సినిమా. కచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం 365రోజులు కష్టపడ్డా. కేవలం రెండు రోజుల కిత్రమే ‘రంగస్థలం’ గడ్డం తీసేశా. ఆ గడ్డాన్ని చాలా మిస్‌ అవుతున్నా. నా సినిమా చూడమని నేను ఎవరినీ అడగను. కానీ, ఈ సినిమా చూడండి.’ అన్నారు రామ్ చరణ్

రామ్ చరణ్ లేటెస్ట్ చిత్రం రంగస్థలం’. సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఐటీ కంపెనీలో జరిగిన కార్యక్రమానికి వెళ్లిన చరణ్‌ అక్కడి ఉద్యోగులతో కలిసి ఈ వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version