Site icon TeluguMirchi.com

” తుఫాన్ ” ను బాగా ఆదరిస్తున్నారు… రామ్ చరణ్

charanమంచి సినిమా కు భాషాపరమైన భేదాలు ఉండవని ” జంజీర్ ” (తుఫాన్) సినిమా తో నిరూపితమయిందని హీరో రామ్ చరణ్ తేజ అంటున్నారు. కధానాయకుడిగా తన స్థానాన్ని విస్తృతం చేసుకునేందుకే తాను హిందీ లో నటించానని, దాని వల్ల నిర్మాతలకు ఉపయోగం ఉంటుందని చరణ్ అభిప్రాయపడుతున్నారు. సినిమా కమర్షియల్ గా ఏ స్థాయి విజయాన్ని చేరుకుంటుందో తాను చెప్పలేనని, అయితే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరిస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఈ సినిమాను తన తండ్రి చిరంజీవి ఇంకా చూడలేదని, పార్లమెంటు సమావేశాల కారణంగా ఆయనకు సమయం అనుకూలించలేదని ఆయన చెప్పారు. షూటింగ్ నిమిత్తం విదేశాలలో వున్న కారణంగా ” జంజిర్ ” సినిమాను అమితాబ్ బచ్చన్ కు ఇంకా చూపలేదని చరణ్ తెలిపారు. ” మగధీర ” సినిమాను హిందీ లో రీ మేక్ చేయాలన్న తలంపుతో చాలామంది తనను సంప్రదించారని, అయితే ఆ సినిమా రీ మేక్ చేయటం తనకు ఇష్టం లేదని, అంత అద్భుతంగా మళ్లీ తీయటం నా దృష్టిలో అసాధ్యమని రామ్ చరణ్ చెబుతున్నారు. చిరంజీవి స్థానాన్ని తాను భర్తీ చేస్తాననటం హాస్యాస్పదమని, తానే కాదు వేరెవరూ మెగా స్టార్ స్థానాన్ని భర్తీ చేయలేరని చరణ్ అన్నారు.

Exit mobile version