Site icon TeluguMirchi.com

అందువల్లే ‘నాటు నాటు..’ గొప్పగా వచ్చింది


ఆస్కార్‌ బరిలో ఉంది RRR నాటు నాటు. ఈ పాటలో చరణ్‌, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు, చూపించిన గ్రేస్‌కి ఫిదా అవుతున్నారు అభిమానులు. ఈ సందర్భంగా టాక్‌ ఈజీ షోలో సామ్‌ ఫ్రగోసోతో మాట్లాడారు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. 50 నిమిషాల పాటు సాగిన పాడ్‌కాస్ట్ లో ఎన్నో విషయాల గురించి స్పందించారు రామ్‌చరణ్‌. స్నేహబంధం వల్లే ‘నాటు నాటు..’ అంత గొప్పగా వచ్చింది అంటూ ఆ పాటతో తనకున్న అనుబంధాన్ని గురించి రామ్ చరణ్ చెప్పారు.

నాటు నాటు పాట కేవలం వినోదాత్మకంగా ఉండదు. ఆ సీక్వెన్స్‌ని రాజమౌళి చాలా అర్థవంతంగా తెరకెక్కించారు. ఆ పాటలో ఉన్న డ్రామా, ఎమోషన్స్ వల్లనే ఆ పాట ఆస్కార్‌ గడపను తొక్కగలిగింది. అవతలివారిని ఓడించిన తర్వాత తమలో తాము పోటీపడిన ఇద్దరు యువకులు, వారి ఆసక్తి, వారి పోటీతత్వం, ఉల్లాసం, హుషారు… ఇలాంటివన్నీ ఆ పాటను అత్యంత ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి.

ప్రతి అడుగూ మాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఒకే ఒక స్ట్రెచ్‌ని దాదాపు రెండు రోజులు చిత్రీకరించాం. ఇద్దరి అడుగులూ, ఊపునూ ఒకేలా సింక్రనైజ్‌ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ప్రతి స్టెప్పూ, ప్రతి కోణంలోనూ పర్ఫెక్ట్ గా కుదిరింది. కీరవాణి అద్భుతమైన బీట్స్ ఇచ్చారు. పాట అంత అద్బుతంగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఉక్రెయిన్‌లో నాటు నాటు పాట కోసం మేం స్టెప్పులు వేస్తున్న సమయంలోనే యుద్ధమేఘాలు ఆవరించాయి. సెక్యూరిటీ కట్టుదిట్టమైంది. ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్‌ ఆయన ప్యాలస్‌లో మమ్మల్ని షూటింగ్‌ చేసుకోనిచ్చారు. చాలా బాగా అనిపించిన క్షణాలవి అని రాంచరణ్ పేర్కొన్నారు.

Exit mobile version