Site icon TeluguMirchi.com

ఫిబ్రవ‌రి 6న మొద‌లుపెడ‌తారు !

ramchar srikanthదర్శకుడు కృష్ణ వంశి తో చరణ్ ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. చాలారోజుల క్రితమే స్ర్కిప్టు ఫైన‌ల్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్ కు ఎట్టకేల‌కు ముహూర్తం ఖ‌రారైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవ‌రి 6న మొద‌లుపెడ‌తారు. అదే నెల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌కి శ్రీకారం చుడ‌తారు. ఈ చిత్రంలో వెంకటేష్ నటిస్తారని వినిపించింది. అయితే వెంకీ తన పార్ట్ స్క్రీప్ట్ నచ్చకపోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నాడు. వెంకీ స్థానం లో శ్రీకాంత్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మల్టీ స్టారర్ లో చరణ్ కు జోడిగా కాజల్ పేరు వినిపిస్తుంది. శ్రీకాంత్ కు జోడి ని వెతుకుతున్నారు.

Exit mobile version