ఉపాసన కామినేని కొణిదెల ఈ సమాజం బాగుండాలంటూ దాతృత్వం కోసం పిలుపునిచ్చే వ్యక్తుల్లో ఎప్పుడూ ముందుటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ వారాంతంలో ఆమె తన భర్త గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి దుబాయ్‌లో బేబీ షవర్ సెలబ్రేషన్స్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారి దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
ఈ వేడుకలో చరణ్, ఉపాసన జంట చూడ ముచ్చటగా అనిపించారు. ఉపాసనకు ఎలప్పుడు మద్ధతు అందించే ఆమె సోదరి అనుష్పాల కామినేని, సింధూరి రెడ్డి ఈ పార్టీని అద్భుతంగా నిర్వహించారు. ఇవి వారికి మరుపురాని క్షణాలుగా చెప్పవచ్చు. ఉపాసన అమ్మమ్మ ఈ వేడుకలో హుందాగా కనిపించి అందరి హృదయాలను దోచుకున్నారు. ఉపాసన.. రామ్ చరణ్‌తో కలిసి జరుపుకున్న ఈ వేడుకలకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక రామ్ చరణ్, ఉపాసన కామినేని కొణిదెల జంట చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. త్వరలోనే తల్లిదండ్రులుగా మారబోతున్న వీరి కొత్త ప్రయాణం చాలా గొప్పగా ఉంటుందనటంలో సందేహం లేదు.
Soooooo grateful ❤️ for all the love.
Thank u my darling sisters & all our friends & family for the best baby shower. @AlwaysRamCharan pic.twitter.com/nfmxsXbGhM
— Upasana Konidela (@upasanakonidela) April 5, 2023