Site icon TeluguMirchi.com

నాయక్ గా నన్ను నిలబెట్టారు: చరణ్

ramcharan vizag meetఈ సంక్రాంతి కి ‘నాయక్’గా సందడి చేసారు రామ్ చరణ్. ఇప్పుడు ఆ విజయానందాన్ని అభిమానులతో కలిసి పంచుకుంటున్నారు. ‘నాయక్’ సినిమాని విజయవంతం చేసినందుకు అభిమానులకూ, ప్రేక్షకులకూ కృతజ్ఞతలు తెలియచేయడానికి రామ్ చరణ్ రాష్టంలోని కొన్ని ప్రధాన థియేటర్ లలో విజయోత్సవ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ “అభిమానులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో అలాంటి సినిమాల్లోనే నటిస్తా. నా కోసం, నాకు వచ్చే పేరు కోసం ప్రయోగాల జోలికి వెళ్ళాను. ‘నాయక్’పై నేను పెట్టుకున్న నమ్మకాన్ని అభిమానులు నిలబెట్టారు. నన్ను నిజంగానే ‘నాయక్’ని చేసారు. వినాయక్ నాకు టైలర్ మేడ్ పాత్ర ఇచ్చారు. ఆయకను ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక ముందు కూడా అభిమానులను మెప్పించడమే ధ్యేయంగా సినిమాలు చేస్తా” అని చెప్పారు.

Exit mobile version