Site icon TeluguMirchi.com

‘ నాయక్ ‘ సెన్సార్ రిపోర్ట్ అదుర్స్

Nayak Movie Reviewవిడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తున్న ‘ నాయక్ ‘ సినిమా సెన్సార్ కార్యక్రమాలు శుక్రవారం నాడు పూర్తయ్యాయి. సెన్సార్ అధికారులు ఈ చిత్రానికి ‘ ఎ ‘ సర్టిఫికేట్ ను ఇచ్చారు. ఈ నెల 9 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో బిజినెస్ చేసింది. రికార్డు స్థాయిలో అత్యధిక సంఖ్యలో థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేసారు. ఒక్క జంటనగరాల్లోనే 110 థియేటర్లలో ‘ నాయక్ ‘ విడుదల కానున్నది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా నైజాం హక్కుల్ని పొందారు. ఒక్క నైజాం లోనే 300 కు పైగా థియేటర్లలో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఒక హిరో కేవలం అయిదు సినిమాలతోనే ఇంత భారీ స్థాయి బిజినెస్ చేయటం పరిశ్రమలోనే అరుదుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ‘ నాయక్ ‘ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మకంగా వుందని, రామ్ చరణ్ నటన ఎలెక్ట్రిఫైయింగ్ గా వుందని, రెండు పాత్రలను చరణ్ అద్భుతంగా పోషించారని, పాటలు చాలా రిచ్ గా వున్నాయని, చరణ్ డ్యాన్సులు అద్భుతంగా చేసాడని, ఫైట్లు కూడా వళ్లు గగుర్పొడిచేలా వున్నాయని సెన్సార్ సభ్యుడొకరు చెప్పారు. సినిమా ఆసాంతం పూర్తిగా ఎంటర్టైనింగ్ గా వుందని, కామెడి సన్నివేశాలు పుష్కలంగా వున్నాయని ఆయన చెప్పారు. తన అంచనా ప్రకారం ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆయన తెలిపారు. సో….’ నాయక్ ‘ సినిమా ‘ మగధీర ‘ సినిమా తరువాత చరణ్ కు మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఆశించవచ్చు అన్నమాట. ఇక మెగా ఫ్యాన్స్ కు పండగే పండగ!!!

Exit mobile version