Site icon TeluguMirchi.com

సీనియర్ హీరోలతో గ్లోబల్ స్టార్ స్టెప్పులు..


సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. ఈ మూవీలో మన వెంకీ మామ కీలకపాత్ర చేస్తున్నాడు, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవలే ఈ సినిమానుంచి బతుకమ్మ సాంగ్ ను రిలీజ్ చేయగా, తాజాగా ‘ఎంటమ్మ..ఎంటమ్మ..’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ లో సల్మాన్ ఖాన్, వెంకీ మామ లుంగీ కట్టి డాన్స్ చేశారు. అలాగే సాంగ్ చివరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చి క్యాచీ స్టెప్స్ తో అదరగొట్టారు. ఈ సాంగ్ పాయల్ దేవ్ కంపోజ్ చేశాడు. విశాల్ దద్లానీ, పాయల్ దేవ్ పాడారు.

Yentamma - Kisi Ka Bhai Kisi Ki Jaan | Salman Khan,Pooja,Venkatesh,Ram Charan | Vishal,Payal,Raftaar

ఇకపోతే ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమా తమిళంలో సూపర్‌ హిట్టయిన ‘వీరమ్‌’కు రీమేక్‌. తెలుగులో ‘వీరుడొక్కడే’ పేరుతో డబ్బింగ్ అయింది. ఆతర్వాత పవన్‌ కల్యాణ్‌ హీరోగా కాటమరాయుడిగా తెలుగులో తెరకెక్కింది. ఇక సల్మాన్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జగపతిబాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 21న రంజాన్ కానుకగా థియేటర్లలోకి రానుంది.

Exit mobile version