కేన్స్ చిత్రోత్సవాల‌కు రామ్‌ చ‌ర‌ణ్‌!

Ram-Charan-cans festiwalమెగా హీరో రామ్‌ చ‌ర‌ణ్‌ కి అరుదైన గౌర‌వం ద‌క్కనుంది. ఆయ‌న త్వర‌లో ‘కేన్స్ చిత్రోత్సవా’ల‌కు హాజ‌రు కానున్నారు. అక్కడ చెర్రీకి రెడ్‌ కార్పేట్ స్వాగ‌తం ప‌ల‌కనున్నారు. కేన్స్ చిత్రోత్సవాల‌కు ఆహ్వానం అందడం అంటే… అదో క్రెడిట్‌. ద‌క్షిణాది నుంచి అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. అందులో చెర్రీకీ పిలుపు వ‌చ్చింది. అయితే చ‌ర‌ణ్ టాలీవుడ్ హీరోగా కాదు. బాలీవుడ్ హీరోగా అక్కడ అడుగుపెట్టనున్నారు. చ‌ర‌ణ్ జంజీర్ సినిమా చేస్తున్నాడు. ఆ టీమ్‌ తో క‌లిసి… కేన్స్‌లో సంద‌డి చేయ‌నున్నాడు.