దిగ్గజాల పక్కన మా పేర్లు చూడటం చాలా గర్వకారణం : రామ్ చరణ్


దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన ‘RRR’ సినిమా గోల్డెన్‌ గ్లోబ్‌, క్రిటిక్‌ ఛాయిస్‌ సహా పలు అంతర్జాతీయ అవార్డులను సైతం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం, బెస్ట్‌ యాక్షన్‌ ఫిలిం, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌, బెస్ట్‌ స్టంట్స్‌ కేటగిరీల్లో RRR సినిమాకు హెచ్‌సీఏ అవార్డులు వరించాయి. అలాగే స్పాట్ లైట్ అవార్డ్ కూడా RRR కే దక్కింది. అంతేకాదు ఈ ప్రెస్టేజియస్ అవార్డ్స్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మరియు చరణ్ పేర్లు బెస్ట్ యాక్టర్ ఇన్ యాక్షన్ మూవీ కేటగిరీలో నామినేట్ అయ్యాయి. ఈ కేటగిరీలో చరణ్, ఎన్టీఆర్ లకు పోటీగా నికోలస్ కేజ్, టామ్ క్రూజ్ మరియు బ్రాడ్ పిట్ వంటి దిగ్గజాలు కూడా వున్నారు. ఇటువంటి దిగ్గజాల పక్కన అన్నయ్య ఎన్టీఆర్ పేరు, నా పేరు చూడటం ఎంతో అందమైన అనుభూతి అని రామ్ చరణ్ పేర్కొన్నారు. కాగా ఈ అవార్డు ఎవరు గెలిచారనేది మార్చ్ 16 న అనౌన్స్ చేస్తారు.