మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలోని ముఖ్య సన్నివేశాలను గోదావరి పరిసర ప్రాంతాలలో తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైద్రాబాద్‌లో జరుగుతోంది. ఎండ తీవ్రతల వల్ల షూటింగ్‌కు కాస్త అంతరాయం కలిగింది. ముందుగా ప్లాన్ చేసుకున్నట్టు కాకుండా అటు ఇటుగా షూటింగ్ జరుగుతోంది. సహజంగా సుకుమార్ చిత్రాలు ఇలాగే ఆలస్యం అవుతాయి. ఈ ఒక్క చిత్రానికి డేట్స్ తేడా వస్తే అది మిగతా వాటిపై ప్రభావం పడుతుంది కాబట్టి చెర్రీ ఈ చిత్రం గురించి సుకుమార్‌కు తేల్చి చెప్పాడట.
ఈ చిత్రాన్ని అగస్టు చివరికల్లా పూర్తి చేయాలని గట్టిగా చెప్పాడట. అందుకు సుకుమార్ కూడా ఒప్పుకున్నాడని సమాచారం. అగస్టులో మెగాస్టార్ ‘ఉయ్యాలవాడ’ చిత్రం ప్రారంభం అయ్యి సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. ఈ చిత్రానికి చెర్రీ నిర్మాత అంతేకాకుండా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కే చిత్రం కాబట్టి నిర్మాత పక్కనే ఉండి అన్నీ చూసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది. అందుకే సుకుమార్‌తో చేసే సినిమాని అగస్టు వరకు పూర్తి చేసుకుని ఆ తర్వాత చిరు సినిమాపై మొత్తం ఫోకస్ పెట్టాలని చెర్రీ భావిస్తున్నాడు.