రామయ్యా వస్తావయ్యా రిలీజ్ డేట్ ఖాయమైంది. ఈ సినిమా వాయిదా పడనుందా? మరో వారం రోజులు వెనక్కి వెళ్లనుందా.? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ నిర్మాత దిల్‌రాజు రిలీజ్ డేట్ ని మరోసారి ఖాయం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈనెల 10న ఈ సినిమాని తీసుకొస్తామని అభిమానులకు భరోసా ఇచ్చేశారు దిల్‌రాజు. దసరా పండుగను క్యాష్ చేసుకోవాలని, రామయ్యా క్రేజ్‌తో కాసులు రాల్చుకోవాలనేది దిల్ రాజు ఆలోచన. సినిమా దసరాకి ముందొచ్చేస్తే… వసూళ్లు కుమ్మరించుకోవచ్చు. పాటలూ బాగానే వినిపిస్తున్నాయి. కాబట్టి దిల్‌రాజుకి ఇంతకంటే మించిన తరుణం దొరకదు. అందుకే అనుకొన్న సమయానికి రామయ్యాను ముస్తాబు చేసేస్తున్నారు. అన్నట్టు… రామయ్యా వస్తావయ్యా లేటెస్ట్ సాంగ్ టీజర్‌ని కూడా దిల్‌రాజు విడుదల చేశారు. సినిమా వచ్చేలోగా మరో కొత్త ట్రైలర్ కూడా బయటకు వస్తుందట.