11న ఖాయ‌మ‌య్యా

rvఉత్కంఠ‌త‌కు తెర‌ప‌డింది. రామ‌య్యా వ‌స్తావ‌య్యా రిలీజ్ డేట్ ఖాయ‌మంది. ఈ సినిమాని ఈనెల 11న తీసుకొస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో నిర్మాత దిల్ రాజు ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. సీమాంధ్ర ఉద్యమ నేప‌థ్యంలో రామ‌య్యా వ‌స్తావయ్యా సినిమా వ‌స్తుందా? రాదా? అనే అనుమానాలు వ్యక్తమ‌య్యాయి. ఈనెల 11న తీసుకురావ‌డం వీలుకాక‌పోతే.. ఈ నెల‌లో రావ‌డం క‌ష్టమ‌ని బ‌య్యర్లు భ‌య‌ప‌డ్డారు. కానీ దిల్ రాజు మాత్రం సీమాంధ్ర ఎఫెక్ట్ ప‌క్కన పెట్టి ధైర్యంగా ఈ సినిమాని విడుద‌ల చేస్తున్నారు. సోమ‌వారం సెన్సార్ కార్యక్రమాలు ముగించుకొన్న వెంట‌నే సినిమాపై న‌మ్మకంతో, వ‌చ్చేది ద‌స‌రా సీజ‌న్ కావ‌డంతో ఈ సినిమాని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ 11నే తీసుకురావాల‌ని దిల్ రాజు డిసైడ్ అయిపోయారు. థియేట‌ర్ల లిస్ట్ కూడా ప్రక‌టించేశారు. ఇంకేముంది..? నంద‌మూరి అభిమానులు పండ‌గ చేసుకోవ‌డ‌మే మిగిలి ఉంది.