మాస్ మహా రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శరత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మించారు. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలు. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వస్తుంది.
డిప్యూటీ కలెక్టర్ క్యారెక్టర్‌లో హై ఓల్టేజ్ మాస్ డైలాగ్స్‌లో మాస్ మాహారాజా అదరగొట్టేసినట్లు తెలుస్తోంది. చట్టానికి లోబడి, న్యాయం కోసం బాధ్యత నిర్వహించే పాత్రలో రవితేజ యాక్టింగ్ హైలెట్ అని చెప్పొచ్చని ఆడియన్స్ అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో రవితేజ్ లుక్, మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. సాంగ్స్ యావరేజ్‌గా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్‌గా ఉందంటున్నారు. శరత్ మండవకు డైరెక్టర్‌గా ఇది తొలి సినిమానే అయినా.. రవి తేజను సరికొత్తగా చూపించాడని.. కొన్ని డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయంటున్నారు.
ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని.. ఫస్ట్ టూ గుడ్ అంటూ అని ఆడియన్స్ చెబుతున్నారు. రవితేజ కంప్లీట్లీ మాస్ అవతార్‌లో కనిపిస్తారని అంటున్నారు. సెకండాఫ్‌లో మలుపులు, ట్విిస్టులతో స్క్రీన్ ప్లే మెస్మరైజ్ చేస్తుందని.. క్లైమాక్స్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారు. అయితే, కామెడీ లేకపోవడం, థ్రిల్ మిస్ అవడం, లాజిక్ లేని సీన్లు, పాటల టైమింగ్ మిస్ అవడం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని మరికొంతమంది అంటున్నారు.