Site icon TeluguMirchi.com

రామానాయుడుకు ఎన్టీఆర్ పురస్కారం

RAJ_8960గుంటూరు జిల్లా తెనాలిలో రెండవ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు బుధవారం నాడు వైభవంగా ప్రారంభమైనాయి. నాలుగు రోజులపాటు జరుగనున్న ఈ ఉత్సవాలలో 17 దేశాలకు చెందిన ఇరవైకి పైగా చిత్రాలను ప్రదర్శించనున్నారు. బుధవారం నాటి సభకు నిర్వాహక సంస్థ అయిన తెనాలి కల్చరల్ ఫిలిం సొసైటి అధ్యక్షుడు రావిపాటి వీర నారాయణ అధ్యక్షత వహించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ గౌరవ అతిధిగా పాల్గొన్నారు. ఇదే వేదికపై స్వర్గీయ నందమూరి తారక రామారావు పురస్కారాన్ని ప్రముఖ నిర్మాత డాక్టర్ డి. రామానాయుడుకు అందజేశారు. వక్తలందరూ రామానాయుడు గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ప్రసంగించారు. సభలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు ఎన్.శంకర్, సినీనటుడు ఏవీయస్, దర్శకుడు రామ్ ప్రసాద్, నటుడు మహర్షి రాఘవ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు పట్టణంలో షుమారు రెండు గంటలపాటు జరిగిన ఫిల్మోత్సవ్ ర్యాలి లో వేలాదిమంది విద్యార్ధిని, విద్యార్ధులు పాల్గొన్నారు.

Exit mobile version