Site icon TeluguMirchi.com

ఆకట్టుకుంటున్న ‘ఏజెంట్‌’ రామకృష్ణ సాంగ్


యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ ఇప్పటికే ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పింది. ఏజెంట్ టీజర్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వగా, ఇప్పటికే విడుదలైన పాటలు కూడా మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి.

తాజాగా మేకర్స్ ఏజెంట్ నుంచి బాయ్స్ సెలబ్రేట్ చేసుకునే బ్రేక్-అప్ సాంగ్ ‘రామకృష్ణ’ పాటని విడుదల చేశారు. ఇది బ్రేక్-అప్ సాంగ్ అయినప్పటికీ, అఖిల్ ఈ అకేషన్ ని జరుపుకోవడంతో పండుగ వైబ్ తో అలరించింది. హీరో జీవితాన్ని బ్రేకప్ ప్రభావితం చేయలేదని చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగా చెప్పారు. అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. హిప్ హాప్ తమిళ పెప్పీ నంబర్‌ని స్కోర్ చేయగా, రామ్ మిర్యాల ఈ పాటని ఎనర్జీటిక్ గా పాడారు. ఇక మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

Rama Krishna Lyrical | Agent | Akhil Akkineni | Surender Reddy | Hiphop Tamizha |

Exit mobile version