ఆకట్టుకుంటున్న ‘రామబాణం’ సెకండ్ సింగల్ ‘దరువెయ్యరా..’


మ్యాచో హీరో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రం సెకండ్ సింగిల్ ‘దరువెయ్యరా..’ ను కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేసారు మేకర్స్. ఇక ఈ సాంగ్ లో గోపీచంద్, డింపుల్ హయతి పండుగ వాతావరణంలో సంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని మే 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.