ఎన్టీఆర్‌తో రాజమౌళి తీసిన ఆ సినిమా రమాకు నచ్చలేదట!
ramesh
తాను తెరకెక్కించిన ఏ చిత్రమైనా కూడా రికార్డులు బ్రేక్ చేయ్యాల్సిందే అన్నట్టుగా వాటిని చెక్కి చెక్కి టాలీవుడ్ జక్కన్నగా ప్రసిద్ది చెందాడు దర్శకధీరుడు రాజమౌళి. ఈయన తెరకక్కించిన చిత్రాలన్ని కూడా మంచి విజయాలనే సొంతం చేసుకున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి 2’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో చిత్ర యూనిట్ అంతా కూడా సన్నాహాలు మొదలెట్టారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గోన్న రాజమౌళి సతీమణి రమా రాజమౌళి తనకు తన భర్త తెరకెక్కించిన ఒక సినిమా నచ్చలేదని చాలా ధైర్యంగా చెప్పింది. రాజమౌళి చిత్రాలు నచ్చకపోవడమా పైగా ఆయన సతీమణికే నచ్చలేదా అని అంతా షాక్ అయ్యారు.
రాజమౌళి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘యమదొంగ’ చిత్రం తనకు అస్సలు నచ్చలేదని రమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అయినా ఆ సినిమా బాగానే ఆడిరది, అదంతా కూడా తారక్ వల్లనే జరిగింది. కానీ అంత విజయం సాధించినా కూడా నాకు ఆ చిత్రం పెద్దగా నచ్చదు అంటూ రాజమౌళి తెరకెక్కించిన ఎన్టీఆర్ చిత్రంపై సంచలన కామెంట్లు చేసింది. అయితే ఎందుకు నచ్చలేదు అనే విషయాన్ని మాత్రం రమా రాజమౌళి చెప్పలేదు. ‘బాహుబలి’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన రమా రాజమౌళి డ్రెసింగ్ కూడా మొత్తం మార్చేసిందట. మొదట్లో లూజు బట్టలు వేసుకునే రాజమౌళి తాను మార్చేశాను అంటూ రమా రాజమౌళి నవ్వుతూ చెబుతోంది.