Site icon TeluguMirchi.com

Vishwambhara : హనుమాన్ జయంతి స్పెషల్.. ‘విశ్వంభర’ నుంచి ‘రామ రామ’ సాంగ్ రిలీజ్


Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విశ్వంభర. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను నెలకొల్పాయి. ప్రతిష్టాత్మక యువి క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ ని మేకర్స్ ప్రారంభించారు. ఈ రోజు హనుమాన్ జయంతి శుభ సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ ను రిలీజ్ చేశారు.

Also Read : చీరలో బాపూబొమ్మలా మెరుస్తున్న అనన్య నాగాళ్ల

ఈ పాట సోల్ ఫుల్ ఫీమేల్ వాయిస్ తో ప్రారంభమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి పవర్ ఫుల్ వాయిస్ “జై శ్రీ రామ్” అనే నినాదాన్ని ప్రతిధ్వనిస్తుంది. శ్రీరాముడు, సీతా కళ్యాణం వేడుకల నేపథ్యంలో సాంగ్ విజువల్ ఫీస్ట్ లా వుంది. ఇది హనుమంతునికి శ్రీరాముడి పట్ల ఉన్న అచంచలమైన ప్రేమ, భక్తిని అందంగా చూపించే ఘన నివాళి. మ్యూజికల్ జీనియస్ ఎం.ఎం. కీరవాణి, ఆధ్యాత్మిక, దైవిక శక్తితో నిండిన అద్భుతమైన సాంగ్ కంపోజ్ చేయగా.. లెజెండరీ సింగర్ శంకర్ మహాదేవన్, సింగర్ లిప్సిక ఈ ట్రాక్‌కు తమ ఎనర్జిటిక్ వోకల్స్ అందించారు. ఇక లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి భక్తి, సాంస్కృతిక గొప్పతనాన్ని కవితాత్మకంగా అందించారు.

Also Read : ఫుల్ స్వింగ్ లో హరి హర వీర మల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు.. ఈసారి పక్కా..!

చిరంజీవి గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించారు. హనుమంతుడిగా అలంకరించబడిన పిల్లల ప్రజెన్స్ భక్తిని జోడిస్తుంది. హనుమాన్ జయంతికి ఇది పర్ఫెక్ట్ సాంగ్. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, ఆశికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు.

Rama Raama Lyrical | Vishwambhara | Megastar Chiranjeevi | Vassishta | MM Keeravaani | Ramajogaiah

Exit mobile version