‘రామబాణం’ నుండి ‘ఐఫోన్’ లిరికల్ సాంగ్ రిలీజ్


మాచో స్టార్ గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘రామబాణం’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

కాగా, ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ ప్రోమోని నిన్న రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక నేడు ఐఫోన్ ఫుల్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్. మిక్కీ జె మేయర్ మెలోడియస్ ట్యూన్ అందించిన ఈ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రచించగా రామ్ మిరియాల, మోహన భోగరాజు అద్భుతంగా పాడారు. ప్రస్తుతం ఈ సాంగ్ యువత తో పాటు శ్రోతలు అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా రామబాణం మూవీని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సమ్మర్ కానుకగా మే 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.