దేవదాస్ కాస్త ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అవును హీరో రామ్ అతి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. దేవదాస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్..మొదటి సినిమాతోనే యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస ప్రేమ కథ చిత్రాలతో ఆకట్టుకుంటూ వచ్చిన రామ్..ఇస్మార్ట్ శంకర్ , రెడ్ సినిమాలతో యాక్షన్ హీరో అనిపించుకున్నాడు.
త్వరలో ది వారియర్ మూవీ తో రాబోతున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నాడట. తన చిన్ననాటి స్నేహితురాలినే రామ్ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం , ఎంగేజిమెంట్ ముహూర్తం ఖరారు చేసుకోవడం జరిగిపొయిందట. శ్రావణమాసం లో ఎంగేజిమెంట్ , కార్తీకమాసం లో పెళ్లి చేసేందుకు ఇరు పెద్దలు నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.