వై. ఎస్ జగన్ అనుచరుడితో బాలకృష్ణ

ram-balakrishnaనందమూరి బాలకృష్ణ ఏంటి వై. ఎస్. జగన్ అనుచరుడితో రావడం ఏంటి అనుకుంటున్నారా..? మీము చెప్పేది నిజమే కాకపోతే ఇది సినిమా గురించి చెప్పబోతున్నాం. ప్రస్తుతం బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే క్రియాటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం లో ‘ రైతు ‘ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

కాగా ఈ చిత్రానికి కథ అందిస్తుంది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడు, సాక్షి దినపత్రిక ఫీచర్స్ హెడ్.. ప్రియదర్శిని రామ్ అని తెలుస్తుంది. గతం లో రామ్ ‘మనోడు’ , ‘టాస్’ అనే చిత్రాలకు దర్శకత్వం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రైతు కథ ఫై శ్రద్ద పెట్టాడట. కృష్ణ వంశీ సైతం సందీప్ కిషన్ తో నక్షత్రం అనే సినిమా ని తెరకెక్కిస్తున్నాడు.