Site icon TeluguMirchi.com

ఇస్మార్ట్ సైలెంట్ గా ఉన్నాడేంటి..?

ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నాడు హీరో రామ్. ఓ హిట్ పడితే బాగుండని అభిమానులు గత కొంతకాలంగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుండగా ..పూరి వల్ల వారి ఎదురుచూపులు తెరపడినట్లు అయ్యింది. దాదాపు 80 కోట్ల వసూళ్ల తో దూసుకుపోతున్న ఈ మూవీ నాల్గో వారంలోను మంచి కలెక్షన్లే రాబడుతుంది. ఇక రామ్ తర్వాతి చిత్రం ఏంటి అనేది అభిమానుల ప్రశ్న. మొదటిసారి ఫుల్ మాస్ కథతో వచ్చిన రామ్..తర్వాత కూడా అలాంటి కథతోనే వస్తాడా..లేక ప్రేమకథ చిత్రాన్ని ఎంచుకుంటాడా అనేది అర్ధం కావడం లేదు.

మాములుగా ఏ హీరో అయిన ఓ సినిమా పూర్తి అయ్యిందంటే మరో సినిమాను లైన్ లో పెడతాడు. అలాంటిది రామ్ మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. గతంలో రామ్ తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలు తీసిన కిషోర్ తిరుమల ఓ కథ వినిపించగా.. రామ్ దానిపై పెద్ద ఆసక్తి కనరపరచలేదని అంటున్నారు. మరి రామ్ ఎవరితో ..ఎలాంటి కథ తో వస్తాడో చూడాలి.

Exit mobile version