యువ హీరో రామ్ ‘నేను శైలజ’ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. సక్సెస్ రుచి చూశాక మరోసారి కూడా హిట్‌నే కావాలనుకుంటున్నాడు. అందుకే కాస్త ఆలస్యం అయినా పర్లేదు మంచి సినిమానే చేయాలి అని తీరిగ్గా ఉన్నాడు. రామ్ తదుపరి చిత్రం కోసం తన గెటప్‌ను కూడా మార్చేశాడు. కొత్త లుక్‌లో కొత్త చిత్రంలో దర్శణం ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రామ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఇటీవలె ప్రారంభం అయ్యింది.
‘నేను శైలజ’ చిత్రంలో కొత్త హీరోయిన్ కీర్తి సురేష్ సరసన రొమాన్స్ చేయగా రామ్‌కు బాగా కలిసొచ్చింది. అందుకే ఈ సారి కూడా కొత్త హీరోయిన్‌తోనే రొమాన్స్ చేయాలనుకుంటున్నాడు. ఈ చిత్రంలో రామ్ సరసన రొమాన్స్ చేయడానికి కన్నడ భామ రష్మిక మందనను ఎంపిక చేశారు. ముద్దుగా, బొద్దుగా ఉండే రష్మికతో రొమాన్స్ చాలా బాగుంటుంది అని భావించి చిత్ర యూనిట్ ఈ కొత్త పిల్లను తీసుకున్నారు. సక్సెస్ కోసం రామ్ సరసన రొమాన్స్ చేయడానికి కొత్త పిల్ల రష్మిక మందనను తీసుకువస్తున్నారు అన్నమాట!