ఆ లెక్కన ఇస్మార్ట్ కూడా హిట్టే అంటున్నారు !

డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ కాంబినేషన్‌లో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా వస్తోంది. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఈనెల 18న విడుదలవుతోంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ను చూసిన సెన్సార్ సభ్యులు ఆ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ జారీ చేశారు.

అంటే అడల్ట్స్ -పెద్దలు మాత్రమే చూడదగిన సినిమా అని వాళ్ళు సర్టిఫై చేశారు. ‘దేశముదురు’, ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’ తరవాత పూరీ మరో ‘ఎ’ సర్టిఫికెట్ సినిమా ఇదే. దీంతో ఆ సినిమాలు హిట్ అయినట్టే ఈ సినిమా కూడా హిట్ కొడతామని చెబుతున్నారు. నిజానికి ఈ సినిమాపై ఇప్పటికే బజ్ క్రియేట్ అయ్యింది. సినిమాకు విపరీతంగా ప్రచారం కల్పిస్తున్నారు.

ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు, ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. రామ్ తొలిసారి పూర్తిస్థాయి తెలంగాణ కుర్రాడి పాత్రలో నటించడంతో సినిమాపై ఆసక్తి మరింత ఎక్కువైంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, జయలలిత, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుదాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి నటించిన ఈ సినిమాకి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.