ముందుగానే వస్తున్న #BoyapatiRAPO


బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #BoyapatiRAPO ముగింపు దశకు చేరుకుంది. అయితే దసరా సందర్భంగా అక్టోబర్ 20న విడుదల చేయాలని మొదట భావించిన ఈ చిత్రం అంతకంటే ముందుగానే సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు అధికారికంగా రిలీజ్ డేట్ పోస్టర్ ని విడుదల చేసారు చిత్రయూనిట్.

ఇక ఈ పోస్టర్ లో రామ్ వైట్ అండ్ వైట్‌ సూపర్ చార్మింగ్‌గా కనిపిస్తున్నారు. తెల్లటి చొక్కా, లుంగీ ధరించి, పొలంలో కాఫీని ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకుంటూ కనిపించారు. కాగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లలో ఊరమాస్ గెటప్ లో కనిపించిన రామ్ ఈ పోస్టర్ లో మాత్రం అచ్చ తెలుగు రైతులా మెరిసిపోతున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తునారు.