రామ్ కు ఏం చేయాలో తెలియడం లేదా..?

మొత్తానికి హీరో రామ్ హిట్ కొట్టాడు..గత కొంతకాలం గా సరైన హిట్ లేకపోయేసరికి ఈయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రానిపరిస్థితి..ఈ నేపథ్యంలో పూరి ..రామ్ మాస్ హిట్ ఇచ్చి మళ్లీ ఆయనకు ఉపిరిపోసాడు. రామ్ కెరీర్లో ఇదే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతో ఆయనకు మాస్ ఇమేజ్ కూడా బాగా పెరిగింది. ఇక మీదట కూడా ఆయన ఇలాంటి కమర్షియల్ సినిమాలే చేయాలనీ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే రామ్ కు కొత్త సమస్య వచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ కు ముందు రెండు , మూడు కథలకు ఓకే చేసి పెట్టుకున్నాడట. కాకపోతే అవి పక్క మాస్ చిత్రాలు కాదు..దీంతో ఇప్పుడు అభిమానులు మాస్ చిత్రం చేయాలనీ కోరుకుంటున్న వేళా..మళ్లీ క్లాస్ చిత్రం చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని రామ్ భయపడుతున్నాడట.. ఇంత మాస్ ఇమేజ్ నడుమ ఆ కథలని చేస్తే వర్కవుట్ అవుతుందా అనే సందేహంలో ఉన్నారట. మరి చివరికి రామ్ ఏం డిసైడ్ అవుతాడో చూడాలి.